బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని వటవర్లపల్లి సమీపంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అక్కమహాదేవి మలుపు వద్ద జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. బస్సు రోడ్డుపై అడ్డుగా నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది.