అనివార్య కారణాల వల్ల నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డిపో నుంచి తిరుపతికి వెళ్లే డీలక్స్ బస్సు సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు శుక్రవారం డిపో మేనేజర్ పి. ఎం. డి. ప్రసాద్ తెలిపారు. అచ్చంపేట నుంచి జనవరి 2, 4, 6, 8, 10 తేదీల్లోనూ, తిరుపతి నుంచి 3, 5, 7, 9, 11 తేదీల్లోనూ సర్వీసులు ఉండవని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.