నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మండారి రాణి-సైదులు దంపతుల రెండేళ్ల కుమార్తె జానశ్రీ, ఆడుకుంటూ ఇంటి ముందున్న నీటి సంపులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు గమనించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.