అచ్చంపేట: కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడం: బిఆర్ఎస్

5చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం పార్టీ నాయకులు సమావేశమయ్యారు. 27వ తేదీన నిర్వహించిన రైతు ధర్నా విజయవంతం కావడంతో, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రజా పాలన అంటే ప్రజలపై, రైతులపై కేసులేనా అని ప్రశ్నించారు. రైతుల కొరకై, మండల అభివృద్ధి కోసం ఎన్ని అక్రమ కేసులైనా భరిస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్