వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన బొలెరో, డ్రైవర్ సురక్షితం

766చూసినవారు
వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన బొలెరో, డ్రైవర్ సురక్షితం
కోడేరు మండలంలోని బావాయిపల్లి శివారులో గురువారం వాగు దాటుతుండగా వరద ఉద్ధృతికి ఓ బొలెరో వాహనం కొట్టుకుపోయింది. అచ్చంపేట నుంచి తీగలపల్లికి పాలు పోయడానికి వెళ్తున్న సైదులు అనే వ్యక్తి ప్రయాణిస్తున్న ఈ వాహనం, మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు తగిలి ఆగింది. గ్రామస్థులు, రైతులు జేసీబీ సాయంతో డ్రైవర్‌ను గంటపాటు శ్రమించి రక్షించారు. వాగుపై వంతెన లేకపోవడం వల్ల రాకపోకలు నిలిచిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్