రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం వంగూరు మండలం కొండారెడ్డి పల్లిలో ఇంటింటికీ ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదివారం గ్రామాన్ని సందర్శించి, పలు ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్‌ను పరిశీలించారు. మంత్రులు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు.