నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మికంగా సందర్శించారు. "అమ్మ మాట – అంగన్వాడి బాట" కార్యక్రమంలో భాగంగా కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పరిరక్షణ చర్యలు, నమోదు వివరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.