నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో బుధవారం ఉదయం మానవత్వం మంటగలిపే విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని విద్యానగర్ కాలనీ గౌతమి స్కూల్ వెనుక భాగంలో ఒకటి రెండు రోజుల క్రితం జన్మించిన ఆడశిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కంపచెట్ల పొదల్లో పడేశారు. కుక్కలు ఆ పసికందు ముఖాన్ని పీక్కుతిన్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 7:30 గంటలకు కానిస్టేబుల్ మృతదేహాన్ని తీసుకొచ్చారని, మార్చురీలో ఉంచామని వైద్యులు తెలిపారు. అచ్చంపేట ఎస్సై సద్దాం విచారణ వేగవంతం చేశారు.