అచ్చంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

2చూసినవారు
అచ్చంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి హాజీపూర్ గ్రామానికి సమీపంలో లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రమేష్ కుటుంబ సభ్యులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఒక మహిళ కాలు విరగగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా అచ్చంపేట ప్రాంతానికి చెందినవారని స్థానికులు తెలిపారు. ప్రమాద స్థలానికి అచ్చంపేట పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్