నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి గుర్క మంగమ్మ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆమె మృతితో నియోజకవర్గంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం, ఆమె అంత్యక్రియలు సాయంత్రం స్వగ్రామమైన కడ్తాల్ మండలం చల్లంపల్లిలో నిర్వహించనున్నారు. పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఆమె మృతికి సంతాపం తెలిపారు.