పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనుల్లో జాప్యంపై నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపు జరిగితే ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. భూ సేకరణ, కాలువల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం పనులు చేస్తే సహించేది లేదని నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.