బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి మోస్తరుగా ఉన్న వర్షం ఈదురు గాలులతో ఉగ్రరూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జలమయమయ్యాయి. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.