ఉప్పునుంతల: అక్రమ ఇసుక డంపులు సీజ్

74చూసినవారు
ఉప్పునుంతల: అక్రమ ఇసుక డంపులు సీజ్
అక్రమ ఇసుక డంపుల నిల్వలపై రెవెన్యూ, పోలీసు శాఖ అధికారుల ఆధ్వర్యంలో గురువారం దాడులు నిర్వహించారు. ఉప్పునుంతల మండలంలోని కంసానిపల్లిలో అక్రమ ఇసుక డంపులు నిల్వ చేసిన జితేందర్ అనే యువకుడుపై కేసు నమోదు చేసి 32 ట్రాక్టర్ల ఇసుక డంపుల నిల్వ ఇసుకను సీజ్ చేసినట్లు ఏస్ఐ వెంకట్ రెడ్డి, తహశీల్దార్ ప్రమీల తెలిపారు. ఈ దాడుల్లో అచ్చంపేట డిఎస్పీ పల్లె శ్రీనివాసులు, ఆర్డీవో మాధవి, ఆర్ఐ సుజాత తదితరులు ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్