కల్వకుర్తి: తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి.!

5చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండల కేంద్రంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి తాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి జెల్ల రామస్వామి (49) అనే గీత కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కల్లు సేకరించేందుకు చెట్టు ఎక్కుతుండగా మోకు తెగి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్