నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. మంగళవారం కల్వకుర్తిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల గిరిజన సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల అరవ గిరిజన జోనల్ స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.