కల్వకుర్తి: ఎమ్మార్వో కార్యాలయం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

7చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ ఎమ్మార్వో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్వో కార్తీక్ కుమార్ ను ఆదేశించారు. ఇప్పటివరకు జరిగిన 16 రెవెన్యూ సదస్సులలో 363 దరఖాస్తులు వచ్చాయని, ప్రతి దరఖాస్తుకు నోటీసులు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. సిబ్బంది హాజరు పట్టికను కూడా పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్