కల్వకుర్తి: శివకుమార్ ను అభినందించిన గవర్నర్

69చూసినవారు
కల్వకుర్తి: శివకుమార్ ను అభినందించిన గవర్నర్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన స్వామి వివేకానంద సేవా బృందం అధ్యక్షుడు శివకుమార్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సోమవారం అభినందించారు. ఇటీవల జాతీయ యువజన అవార్డు అందుకున్న నేపథ్యంలో రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ శివకుమార్ కు శాలువాతో సన్మానం చేసి అనంతరం అభినందించారు. స్వామి వివేకానంద సేవబృందం ద్వారా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను గవర్నర్ కు వివరించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్