నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పురాతన గచ్చు బావిని ఆదివారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. ఇటీవల పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకున్న ఈ బావి విశిష్టతను, అక్కడి శివాలయ చరిత్రను మంత్రి అడిగి తెలుసుకున్నారు. చారిత్రక కట్టడాల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, స్థానిక నేతలు పాల్గొన్నారు.