మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎస్పీఎం, 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్ ఆకస్మికంగా సందర్శించారు. ఆయన ఎస్పీఎం సిబ్బందితో మాట్లాడి, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆపరేటర్లు, లైన్ మైన్లు విద్యుత్ సంస్థకు బలమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.