కల్వకుర్తి: గుండెపోటుతో రిపోర్టర్ మృతి

1542చూసినవారు
కల్వకుర్తి: గుండెపోటుతో రిపోర్టర్ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రిపోర్టర్ రాజేందర్ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో, వారు వెంటనే వెల్దండ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన మరణించినట్లు స్థానికులు తెలిపారు. రాజేందర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్