కల్వకుర్తి: బాలుడి ప్రాణం తీసిన బైక్ సరదా

6చూసినవారు
కల్వకుర్తి: బాలుడి ప్రాణం తీసిన బైక్ సరదా
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్ కు చెందిన రఘుపతి, సునీత దంపతుల 13 ఏళ్ల కుమారుడు సాయి ప్రణీత్, వరుసకు మామ అయిన ఇంటికి వెళ్ళాడు. అక్కడ బైక్ తాళాలు కనిపించడంతో, ఎవరికీ చెప్పకుండా బైక్ ను స్టార్ట్ చేసి అతివేగంగా నడపడం ప్రారంభించాడు. రోడ్డుపై మలుపు తిప్పుతుండగా, అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్