నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా గురువారం ఎర్రగడ్డ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ. 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నవీన్ యాదవ్ స్థానికుడిగా ప్రజల సమస్యలపై అవగాహన కలిగి ఉన్నారని తెలిపారు.