కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో సోమశిల గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కాటం విజయలక్ష్మి, వార్డు సభ్యులు శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సోమశిల గ్రామ ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.