కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపనగండ్ల మండలంలో గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కొమ్ము పార్వతి (40) సోమవారం తెల్లవారుజామున ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆమె ఎంత వెతికినా కనపడకపోవడంతో, అదే రోజు సాయంత్రం భర్త కొమ్ము పరమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం గ్రామానికి సమీపంలోని రంగవరం రోడ్డులోని గాలెమ్మ బావిలో కొమ్ము పార్వతి మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.