కొల్లాపూర్‌: హార్టికల్చర్, పాలిటెక్నిక్‌ కళాశాల భవనాల నిర్మాణం

0చూసినవారు
కొల్లాపూర్ నియోజకవర్గంలో హార్టికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలల భవన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం సాయంత్రం పట్టణ శివారులోని వరదెల పరిధిలో సుమారు 104.19 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు. ఈ భూమి కళాశాల నిర్మాణానికి అనుకూలత, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలపై అధికారులతో చర్చించి, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.