కొల్లాపూర్: ఏడేళ్ల తర్వాత అందిన సాయం

1చూసినవారు
కొల్లాపూర్: ఏడేళ్ల తర్వాత అందిన సాయం
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామానికి చెందిన పుట్టపోగు రామచంద్రుడు ఏడేళ్ల క్రితం కృష్ణా నదిలో పడి మృతి చెందారు. అప్పట్లో ప్రభుత్వ సహాయం అందలేదు. ఈ విషయాన్ని నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించి, బాధిత కుటుంబానికి రూ. 3 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును గురువారం అందజేశారు. సాయం పట్ల కుటుంబ సభ్యులు మంత్రికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్