కొల్లాపూర్: 90% పూర్తి చేశామనడం సిగ్గుచేటు: మంత్రి జూపల్లి

0చూసినవారు
మంగళవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పాలకులు పాలమూరు ప్రాజెక్టుకు లక్ష కోట్లకు గాను పావలా వంతు ఖర్చు పెట్టి 90 శాతం పూర్తిచేశామనడం సిగ్గుచేటని విమర్శించారు. మొదటి ప్యాకేజీలో తొమ్మిది మోటార్లకు గాను కేవలం నాలుగు మోటార్లే పెట్టి, అందులో ఒక్క మోటారునే ఆన్ చేశారని ఆక్షేపించారు. నీళ్లు పారేందుకు కాలువలు కూడా పూర్తిచేయలేకపోయారని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టుకు ఇంకా అనేక అనుమతులు కావాల్సి ఉందని, అవన్నీ వచ్చే రెండున్నరేళ్లలో పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్