కొల్లాపూర్: నిరాడంబర నాయకత్వానికి నిదర్శనం మంత్రి జూపల్లి

1చూసినవారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లా పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కొల్లాపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం సికింద్రాబాద్ నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శితో కలిసి సాధారణ ప్రయాణికుల మధ్య ప్రయాణించిన మంత్రి రైలులోనే భోజనం చేస్తూ తోటి ప్రయాణికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. హైదరాబాద్ నుండి అత్యంత దూర ప్రాంతాల్లో ఒకటైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సైతం ప్రజాధనంపై ఉన్న బాధ్యతకు నిదర్శనమని, ప్రజల డబ్బు ఆదా చేయడం, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్