స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా, పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం కొల్లాపూర్లోని తన నివాసంలో ఆన్ లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా వివరాలను నమోదు చేసుకున్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన ప్రాతిపదిక అని, డిజిటల్ పద్ధతిలో వివరాలను నమోదు చేసే సౌకర్యాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని, ఆన్ లైన్ స్వీయ గణన ద్వారా సమయం ఆదా అవుతుందని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.