కొల్లాపూర్: పేద రైతులకు పట్టాలు ఇవ్వాలని వినతి

65చూసినవారు
కొల్లాపూర్: పేద రైతులకు పట్టాలు ఇవ్వాలని వినతి
కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు శివారు 62 సర్వే నంబర్ లో భూములు సాగు చేసుకుంటున్న పేద రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సీపీఎం నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. పెంట్లవెల్లి మండలంలో కలెక్టర్ పర్యటించిన సందర్భంగా కలిసి పరిస్థితిని వివరించారు. 200మంది రైతులు గత 30ఏళ్లుగా భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని వారికి ఉపాధి కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్