కొల్లాపూర్ లో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

1చూసినవారు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, మంత్రి జూపల్లి కృష్ణారావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి పిలుపుమేరకు శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో యువజన కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేటీఆర్ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందువల్లే ఆయన గతంలో మంత్రిగా పనిచేయగలిగారని, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ జాతీయ పార్టీ నాయకుడిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉరితీయాలని అనడం సరికాదని హితవు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్