కూతురిని కాపాడే ప్రయత్నంలో తల్లి నీట మునిగి మృతి

1చూసినవారు
కూతురిని కాపాడే ప్రయత్నంలో తల్లి నీట మునిగి మృతి
నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం వెల్టూరులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. అనూష(35) తన ఇద్దరు పిల్లలు ధనలక్ష్మి(12), అక్షిత(10)లకు ఈత నేర్పించడానికి గ్రామ సమీపంలోని నీటి గుంత వద్దకు తీసుకెళ్లారు. ఈత కొడుతుండగా అక్షిత నీటిలో మునిగిపోతుండటంతో, ఆమెను కాపాడే ప్రయత్నంలో తల్లి అనూష నీటిలోకి దూకింది. ఈత రాని అనూష నీట మునిగి మృతి చెందగా, పెద్ద కుమార్తె ధనలక్ష్మి సమీప రైతుల సహాయంతో అక్షితను రక్షించింది. ఐదేళ్ల కిందటే భర్తను కోల్పోయిన అనూష, ఇద్దరు పిల్లలను పోషిస్తూ జీవనం సాగిస్తోంది.

సంబంధిత పోస్ట్