సోలార్ విద్యుత్ ప్లాంట్ తో బహుళ ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శనివారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఆయన టీజి ఎస్. పి. డి. సి. ఎల్ సిఎండి ముషరాఫ్ అలీతో కలిసి పరిశీలించారు. గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.