నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ శుక్రవారం మాట్లాడుతూ, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.