నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి, వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై సూచనలు అందించారు. ప్రజలు తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు నిబంధనలు పాటించాలని సూచించారు. సరైన పత్రాలు లేకుండా, మద్యం సేవించి, మైనర్లు, నిర్లక్ష్యంగా లేదా అతివేగంగా వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేసి, యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.