నాగర్ కర్నూల్: కుప్పలుగా చేపల మృతి.!

20చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రాంరెడ్డి పల్లి గ్రామంలో గురువారం చెరువులోని చేపలు పెద్ద ఎత్తున మృతి చెంది నీటిపై తేలాయి. ఈ ఘటనతో స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎవరో దుండగులు చెరువులో విషపూరిత ద్రవ్యం కలపడం వల్లే ఈ మృతి సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్