నాగర్ కర్నూల్: పార్టీ మద్దతు ఇవ్వలేదని నాయకుడు ఆత్మహత్యాయత్నం

9చూసినవారు
నాగర్ కర్నూల్: పార్టీ మద్దతు ఇవ్వలేదని నాయకుడు ఆత్మహత్యాయత్నం
నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో, తన భార్యకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత బంగారయ్య మండల నేతలను కోరారు. అయితే, ఈ విషయాన్ని పక్కనపెట్టి వేరే వారికి అవకాశం ఇవ్వడంతో మనస్తాపం చెందిన బంగారయ్య ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతోనే ఈ చర్యకు పాల్పడినట్లు బాధితుడు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్