నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండి మార్కెట్ యార్డ్ లో వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను బుధవారం సాయంత్రం పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సంయుక్తంగా పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అందుతున్న సదుపాయాలు, ఎదురవుతున్న ఇబ్బందులపై వారు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి తిమ్మసానిపల్లికి చెందిన రాము అనే రైతుతో ఫోన్లో నేరుగా మాట్లాడి పంట దిగుబడి, కొనుగోలు విధానం, తూకం తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం, తేమ శాతం రికార్డులను అధికారులు ఏ విధంగా నమోదు చేస్తున్నారో స్వయంగా తనిఖీ చేశారు.