నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని అయ్యవారిపల్లి గేటు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేశ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ ను ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని, యువకుడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.