నాగర్ కర్నూల్: ఉపసంహరణ పూర్తి.. గుర్తుల కేటాయింపు

6చూసినవారు
నాగర్ కర్నూల్: ఉపసంహరణ పూర్తి.. గుర్తుల కేటాయింపు
నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఉపసంహరణ అనంతరం, బరిలో నిలిచిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్ బాల్, లేడీస్ పర్స్, టీవీ రిమోట్ వంటి గుర్తులను కేటాయించారు. దీంతో ఎన్నికల ప్రచారం ఊపందుకునే అవకాశం ఉంది.