నాగర్ కర్నూల్: వెట్టి చాకిరి నుంచి 29 మంది కూలీలు విముక్తి.!

3చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి సమీపంలోని ఓ బొగ్గు బట్టీలో ఐదేళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్న 29 మందికి అధికారులు విముక్తి కల్పించారు. వీరు ప్రకాశం జిల్లా కురిచేడు మండలానికి చెందిన 6 కుటుంబాలు. 'కోనేరు' స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో స్పందించిన ఆర్డిఓ సురేశ్ ఆదేశాల మేరకు బుధవారం తహశీల్దార్ విజయ్ కుమార్, ఎస్ఐ నరేష్, డిఎల్ఓ రాజుకుమార్, బాలల హక్కుల పరిరక్షణ అధికారి శ్రీశైలం బాధితులను రక్షించి ఆర్డిఓ కార్యాలయానికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్