నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం సల్కరిపేటలో శనివారం విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న 10 ఏళ్ల చరణ్ అనే బాలుడిని కట్లపాము కరిచింది. తల్లిదండ్రులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఉన్న ఏకైక కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.