నాగర్ కర్నూల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే కూచకుల రాజేష్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లుతో కలిసి ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డిటిఓ చిన్న బాలు ఆధ్వర్యంలో కలెక్టర్, ఎమ్మెల్యే, అడిషనల్ ఎస్పీ ప్రజలకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి, రాంగ్ రూట్లో, అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపకూడదని సూచించారు.