బుధవారం వెలువడిన 10వ తరగతి పరీక్షలలో నాగర్ కర్నూల్ జిల్లా 100% ఫలితాలు సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుత ఫలితాల నేపథ్యంలో జిల్లా విద్యా అధికారులను ఆయన తన ఛాంబర్లో అభినందించారు. జిల్లాలో విద్యను మరింత అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ ఫలితాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయని ఆయన అన్నారు.