నాగర్ కర్నూల్ జిల్లా రూరల్ మండలం గగ్గలపల్లి గ్రామంలో వంగ స్వరూప, ధనుంజయ రెడ్డి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని శనివారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, పేదలైతే చాలు, ఏ పార్టీ అని చూడకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.