నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం కొల్లాపూర్ మండలంలోని సోమశిల ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు. ఏకో టూరిజం, హేలి టూరిజం వంటి పనులను సమీక్షించి, 167 జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. సోమశిల ప్రాంతానికి మరింత గుర్తింపు తేవడానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.