నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి బుధవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ నుంచి ఆమనగల్లు వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మహాలక్ష్మి పథకం అమలు తీరును పరిశీలించి, బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడి పథకం వల్ల కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. పథకంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే విషయాలపై కూడా ఎంపీ మల్లు వివరాలు సేకరించారు.