నాగర్ కర్నూల్: దసరా కానుకగా ప్రతి కుటుంబానికి రైస్ కుక్కర్

2049చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా కానుకగా గ్రామంలోని ప్రతి కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సమకూర్చిన రైస్ కుక్కర్లను మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఆదివారం పంపిణీ చేశారు. రైస్ కుక్కర్లు అందుకోవడానికి మహిళలు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్