నాగర్ కర్నూల్ జిల్లా నాగులపల్లి తండాకు చెందిన యువ కుస్తీ యోధుడు ఆర్. శ్రీకాంత్ అండర్ 15 సౌత్ ఇండియన్ నేషనల్ కుస్తీ పోటీల సెలక్షన్స్ లో భాగంగా మంగళవారం జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. రాముడు నాయక్ కుమారుడైన శ్రీకాంత్ ఈ విజయం సాధించడం పట్ల సర్పంచ్ రాములు నాయక్, తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.