వైజ్ఞానిక ప్రదర్శనలో నాగర్ కర్నూల్ విద్యార్థిని ప్రతిభ

10చూసినవారు
వైజ్ఞానిక ప్రదర్శనలో నాగర్ కర్నూల్ విద్యార్థిని ప్రతిభ
కామారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఒక ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గీతామాధురి, తన గైడ్ టీచర్ చాంద్ పాషా పర్యవేక్షణలో 'ఆటోమేటెడ్ ఫర్టిలైజర్' అనే పరికరాన్ని రూపొందించింది. ఈ వినూత్న ఆవిష్కరణ జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై శనివారం డీఈఓ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం జిల్లా విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్